రద్దయిన నోట్లుంటే నేరం
ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
కనీసం రూ.10వేల జరిమానా
బ్యాంకుల్లో జమకు రేపటితో ముగియనున్న గడువు
తగిన కారణాలు చెబితేనే ఆ తర్వాత ఆర్‌బీఐ శాఖల్లో జమ
దిల్లీ
రద్దయిన పెద్ద నోట్లు రూ.10వేలకన్నా ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటే నేరం కానుంది. ఇంత మొత్తంలో పాత పెద్ద నోట్లను బదిలీ చేసినా, స్వీకరించినా కూడా నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్సును తీసుకొచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపింది. బ్యాంకుల్లో జమ చేయని రద్దయిన పెద్ద నోట్లను నాశనం చేయడానికి వీలు కల్పించేలా భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) చట్టాన్ని సవరించేందుకూ ఈ ఆర్డినెన్సు అవకాశం కల్పిస్తోంది. పాత రూ.500నోట్లను, రూ.1,000 నోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి విధించిన గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ప్రత్యేకంగా పేర్కొన్న ఆర్‌బీఐ శాఖల్లో మాత్రం వచ్చే ఏడాది మార్చి 31 వరకు జమ చేయవచ్చు. ఈ నెల 30లోపు బ్యాంకుల్లో జమ చేయలేకపోయిన వారు ఆ తర్వాత ఆర్‌బీఐ శాఖల్లో జమ చేయాలంటే తగిన కారణాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది. రద్దయిన పెద్ద నోట్లను మార్చి 31 తర్వాత కలిగి ఉన్నవారికే ఈ ఆర్డినెన్సు వర్తిస్తుందా లేదా ఈ నెల 30 తర్వాత కలిగి ఉన్నవారికి కూడా వర్తిస్తుందా అన్న విషయమై అధికార వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ గత నెల 8న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో న్యాయవివాదాలకు ఆస్కారం లేకుండా ఉండాలంటే ఈ నోటిఫికేషన్ ఒక్కటే సరిపోదని, సంబంధిత చట్టానికి తగిన సవరణలు అవసరమని ప్రభుత్వ వర్గాలు భావించాయి. నోటు కలిగి ఉన్న వారికి తగిన విలువ చెల్లిస్తామని నగదుపై భారత రిజర్వు బ్యాంకు పూచీ ఉంటుంది. పాత నోట్లను తిరిగి ఇవ్వడానికి తగినంత అవకాశం ఇచ్చిన తర్వాత చట్టం ద్వారా మాత్రమే ఈ పూచీ రద్దవుతుంది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత నిర్ధారిత సంఖ్యలో రద్దయిన నోట్లను కలిగి ఉన్నవారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిందో లేదో స్పష్టత లేదు. ఆ ఆర్డినెన్సును రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే అమల్లోకి వస్తుంది. ఆర్డినెన్సు జారీ అయిన ఆరు నెలల్లోగా పార్లమెంట్ అమోదంతో చట్టంగా మార్చాల్సి ఉంటుంది. రూ.15.4 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను గత నెల 8న రద్దు చేయగా దాదాపు రూ.14 లక్షల కోట్లను బ్యాంకుల్లో జమ చేయడమో, మార్చుకోవడమో జరిగింది.
రుణాలు చెల్లించడానికి మరో నెల గడువు
ముంబయి: పెద్దనోట్ల రద్దు నిర్ణయం వివిధ రంగాలపై చూపిన ప్రభావం నేపథ్యంలో బ్యాంకుల రుణ గ్రహీతలకు మరో నెల రోజుల గడువునివ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్ణయించింది. ఇంతకు ముందు 60 రోజుల అదనపు గడువునివ్వగా తాజాగా మరో 30 (మొత్తం 90) రోజులు ఇచ్చింది. రూ.కోటి లోపు గృహ, కారు, వ్యవసాయ, ఇతర రుణాలకు ఇది వర్తిస్తుంది. రుణాన్ని నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా వర్గీకరించకుండా ఈ వ్యవధి వెసులుబాటు కల్పిస్తుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. నవంబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య కట్టాల్సిన బకాయిలకు ఇది వర్తిస్తుందని వివరించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత చెక్కులను క్లియర్ చేయడంతో సహా సాధారణ బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. నగదు ఉపసంహరణపై ఆంక్షల కారణంగా చాలామంది రుణ వాయిదాలను చెల్లించలేకపోతున్నారు.

రద్దయిన నోట్లుంటే నేరం ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.10వేల జరిమానా బ్యాంకుల్లో జమకు రేపటితో ముగియనున్న గడువు తగిన కారణాలు చెబితేనే ఆ తర్వాత ఆర్‌బీఐ శాఖల్లో జమ దిల్లీ
4/
5
Oleh
Unknown